హైద‌రాబాద్‌లో ఈ వ్య‌భిచారానికే డిమాండ్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వ్య‌భిచారం రోజు రోజుకు కొంత‌పుంత‌లు తొక్కుతోంది. విటుల‌ను ఆక‌ర్షించేందుకు, పోలీసుల‌కు దొర‌క్కుండా ఉండేందుకు ప‌లువురు స‌రికొత్త ప‌ద్ధ‌తుల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలో ప‌లు కాల‌నీల్లో మసాజ్ సెంట‌ర్ల ముసుగులో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. మ‌సాజ్ సెంట‌ర్ల ముసుగులో వ్య‌హిచారం చేస్తే పోలీసుల‌కు అనుమానం రాద‌న్న ప్లాన్‌తో ఇప్పుడు ఈ స‌రికొత్త వ్య‌భిచారం న‌గ‌రంలో ప‌లు మసాజ్ సెంట‌ర్ల‌లో జోరుగా జ‌రుగుతోంది.

విటులు సైతం ఎంచ‌క్కా మ‌సాజ్ చేయించుకునేందుకు అని చెప్పి వెళ్లి వ్య‌భిచారం చేసి వ‌స్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది హైద‌రాబాద్లో క్రేజీ వ్య‌భిచారంగా మారింది. ఈ క్ర‌మంలోనే నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్‌ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు అకస్మికంగా దాడి చేశారు.

తనిఖీల్లో భాగంగా మ‌సాజ్ సెంటర్‌ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *