సూర్యపేటలో బాంబు పేలుడు…

జిల్లా కేంద్రంలోని ఓ పాత సామాన్ల దుకాణంలో సంభవించిన పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. బాంబు వల్లే ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జాతీయ రహదారికి అనుకుని, అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఓ పాత ఇనప సామాన్ల దుకాణంలో శుక్రవారం ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మధ్య ప్రదేశ్‌కు చెందిన రామచంద్ర సహో అక్కడికక్కడే మృతి చెందగా.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సల్మాన్, సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలానికి చెందిన బుజ్జమ్మ, చిలకమ్మలకు గాయాలయ్యాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *