రివ్యూ: ‘మెంటల్ మదిలో…’ స్పెషల్ ప్రీమియర్ టాక్

కథ :
అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం కలిగిన వ్యక్తి. కనీసం ఏ షర్ట్ వేసుకోవాలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ ఆప్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అంతేకాదు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అమ్మాయిలంటే కూడా అరవింద్ కు భయం కలుగుతుంది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరినా అమ్మాయిలతో మాత్రం మాట్లాడడు. పెళ్లి చేస్తే ఏమైన మార్పు వస్తుందని భావించిన అరవింద్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. డజనుకు పైగా పెళ్లిచూపులు చూసినా అరవింద్ ప్రవర్తన కారణంగా ఒక్కటి కూడా సెట్ కాదు. చివరకు స్వేచ్ఛ (నివేథ పెతురాజ్), అరవింద్ తో పెళ్లికి ఓకె చెపుతుంది.

అరవింద్ కూడా తొలి చూపులోనే స్వేచ్ఛతో ప్రేమలో పడతాడు. తనతో పరిచయం అయిన తరువాత అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వీరి ఎంగేజ్ మెంట్ వాయిదా పడుతుంది. అదే సమయంలో అరవింద్ ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగానే ముంబై వెళ్లిన అరవింద్, కొద్ది రోజులు తరువాత స్వేచ్ఛకు ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్తాడు. అరవింద్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? ముంబైలో ఏం జరిగింది..? చివరకు అరవింద్, స్వేచ్ఛలు ఒక్కటయ్యారా అన్నదే మిగతా కథ.

నటీనటులు :
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ. రో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *