మైక్రోసాఫ్ట్‌లో మొద‌లైన ఉద్యోగుల తొల‌గింపు!

టెక్నాల‌జీ జెయింట్ మైక్రోసాఫ్ట్.. కంపెనీ రీఆర్గ‌నైజేష‌న్‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా సుమారు 3 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేకించి సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల తొల‌గింపు ఎక్కువ‌గా ఉండ‌నుంది. క‌స్ట‌మ‌ర్లు, పార్ట్‌న‌ర్ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డం కోస‌మే కంపెనీలో ఈ మార్పులు చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. అన్ని సంస్థ‌ల్లో జ‌రిగిన‌ట్లే ప్ర‌తి ఏడాది మా సంస్థ‌లోనూ మ‌దింపు ఉంటుంది.

అందులో భాంగా కొన్ని శాఖ‌ల్లో ఎక్కువ పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. మ‌రికొన్నింట్లో భారం త‌గ్గించుకోవాల్సి ఉంటుంది అని సంస్థ అధికార ప్ర‌తినిధి చెప్పారు. కంపెనీలో ఉన్న మొత్తం సేల్స్ ఉద్యోగుల్లో ప‌ది శాతం వ‌ర‌కు ఉద్యోగాలు కోల్పోనున్నారు. అందులోనూ వీళ్ల‌లో 75 శాతం అమెరికా బ‌య‌ట ఉన్నావాళ్లే. మైక్రోసాఫ్ట్ త‌మ క్లౌడ్ స‌ర్వీసెస్ ప్రొడ‌క్ట్ అయిన అజ్యూర్‌ను ఎలా ప్ర‌మోట్ చేయాల‌న్న‌దానిపైనే దృష్టి సారిస్తున్న‌ది. ఇందులో అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఉంది. అయితే చివ‌రి త్రైమాసికంలో అంత‌కుముందుతో పోలిస్లే అజ్యూర్ 93 శాతం వృద్ధి సాధించింది. మైక్రోసాఫ్ట్ అమెరికాలో 71 వేల మంది, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 21 వేల మంది ప‌ని చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *