ఫైనల్ లో ఓడిపోవడానికి కారణం అదే.. : మిథాలీ రాజ్

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ మహిళల జట్టు ఫైనల్ వరకు చేరుకొని తుది పోరులో పోరాడి ఓడటంతో జట్టు సభ్యులు ఒక్కసారిగా బాధతో చిన్నబోయారు. అయితే ఈ ఓటమిపై కెప్టెన్ మిథాలీ రాజ్ తనదైన శైలిలో స్పందించింది. చివరి వరకు బాగానే ఆడిన ఇండియన్ జట్టు ఓడిపోవడానికి అసలు కారణం ఒత్తిడివల్లనేనని చెప్పింది. ఓటమి అంచుల్లో ఉన్నా కూడా ఇంగ్లాండ్ బాగా ఆడింది. వారు ఒత్తిడిని తట్టుకొని సమర్థవంతంగా రాణించారు. అయితే అందుకు కారణం ఇంగ్లండ్‌ మహిళలకు ఇక్విలెంట్‌ సూపర్‌ లీగ్‌ వంటి స్వదేశీ లీగ్స్ ఉన్నాయని చెప్పారు. అంతే కాకుండా ఆస్ట్రేలియా లాంటి క్రికెట్ బోర్డులు కూడా పురుషులకు నిర్వహించనట్టుగానే బిగ్‌ బాష్‌ లీగ్‌ను మహిళలకు నిర్వహిస్తున్నారని మిథాలీ చెబుతూ.. ఆ విధంగానే భారత మహిళకు కూడా ఐపీఎల్ ను నిర్వహించాలని కోరింది. లీగ్స్ లో ఆడటం వల్ల జట్టు సభ్యులు మరింత ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే తమకు అండగా నిలుస్తున్న భారత అభిమానులకు ధన్యవాదాలని.. మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం మహిళా క్రికెటర్లుగా మేం గర్విస్తున్నామని మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *