కన్నతల్లి మృతదేహాన్ని చెత్తకుండీలో పడేసిన కుమారుడు

ఓ కుమారుడు అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ కన్నతల్లి శవాన్ని చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. విషయానికి వస్తే…పోలీసుల కథనం ప్రకారం తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌కు చెందిన ముత్తులక్ష్మణన్‌ ఒక ఆలయ పూజారి. సోమవారం నాడు ఉదయం ఆయన తల్లి వసంతి మృతదేహం చెత్తకుండీలో ఉండటం చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విచారణలో ముత్తులక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని స్వయంగా చెత్తకుండీలో పడవేసి వెళ్లినట్లు తేలింది. వయసు పైబడిన కారణంగా తల్లి మృతి చెందిందని, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఈ పని చేసినట్లు ముత్తులక్ష్మణన్‌ తెలిపాడు. 9 నెలలు మోసి, జన్మనిచ్చి, పెంచిన తల్లికి అంతిమ సంస్కారం జరపాల్సిన కుమారుడు తన కృర మనస్తత్వాన్ని చాటాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *