అంతిమ యాత్ర ప్రారంభం

తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత ముఖేశ్‌గౌడ్‌ (60) అంతిమ యాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ నుంచి జంబాగ్‌లోని ఆయన పాత నివాసానికి ముఖేశ్‌గౌడ్ పార్థివదేహాన్ని తీసుకెళ్తున్నారు. స్థానికుల సందర్శనార్థం కొద్దిసేపు అక్కడే ఉంచుతారు. అనంతరం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌ సమీపంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో ముఖేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖేశ్‌గౌడ్‌ గత రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *