నా తల్లితో నెహ్రూకు శారీరక బంధం లేదు

భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూతో తన తల్లి, నాటి వైస్‌రాయ్‌ లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటన్‌ భార్య ఎడ్వినాకు శారీరక సంబంధం లేదని వారి కుమార్తె లేడీ పమేలా కార్మెన్‌ లూయిస్‌ హిక్స్‌ తెలిపారు. ఈ మేరకు తన పుస్తకం ‘డాటరాఫ్‌ ఎంపైర్‌: లైఫ్‌ యాజ్‌ ఏ మౌంట్‌బాటన్‌’లో వివరించారు. మౌంట్‌బాటన్‌ బ్రిటి్‌ష-ఇండియా తుది వైస్‌రాయ్‌గా 1947 ఫిబ్రవరి 12 నుంచి ఆగస్టు 15దాకా ఉన్నారు. అనంతరం స్వతంత్ర భారత గవర్నర్‌ జనరల్‌గా 1948 జూన్‌ 21దాకా వ్యవహరించారు. ఆయన వైస్‌రాయ్‌గా ఇక్కడకు వచ్చేటప్పటికి పమేలా వయసు 17 ఏళ్లు. ఈ పుస్తకం తొలుత 2012లో బ్రిటన్‌లో ప్రచురితమైంది. ఇప్పుడు భారత్‌కు వచ్చింది. హాశెటె సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో నెహ్రూ, వైస్రాయ్ మౌంట్‌బాటెన్ భార్య ఎడ్విన్ మధ్య ఉన్న బంధంపై పలు కోణాలను పమేలా స్పృశించింది. శక్తి, జ్ఞానం సమపాళ్లలో కల లక్షణాన్ని, సాహచర్యాన్ని పండిట్‌జీలో తన తల్లి చూసిందని తెలిపారు.

నెహ్రూ ఆలోచనలు, వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూశాక.. వారెంత గాఢమైన, గంభీరమైన ప్రేమలో ఉన్నారనేది అర్థమైందని, తొలుత తానూ వారిది శారీరక బంధమేనని భావించానని, కానీ అది తప్పని తర్వాత తెలిసిందన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వారికి ఏకాంత సమయం దొరికే అవకాశమే లేదని వైస్రా య్ వద్ద ఏడీసీగా పనిచేసిన ఫ్రెడ్డీ బర్నబే కూడా ధ్రువీకరించారని పమేలా చెప్పారు. భారత్‌ను విడిచిపెడ్తున్న ప్పుడు నెహ్రూకు ఎమరాల్డ్ ఉంగరాన్ని ఇవ్వాలని తన తల్లి ఎడ్వినా భావించింద ని.. కానీ నెహ్రూ అందుకు అంగీకరించరని.. ఆయన కుమార్తె ఇందిరకు బహూకరించారు. ఆర్థిక ఇబ్బందులొస్తే ఆ ఉంగరాన్ని పండిట్‌జీకి ఇవ్వాలని ఇందిరకు సూచించారు అని పమేలా పుస్తకంలో రాశారు. మౌంట్‌బాటెన్ వీడ్కోలు కార్యక్రమంలో నెహ్రూ మాటల్ని పమేలా ప్రస్తావించారు. మీరు ఎక్కడికెళ్లినా ఒక ఉపశమనాన్ని, నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని వెంట తీసుకెళ్తారు. అందుకే భారత ప్రజలు మిమ్మల్ని తమలో ఒకరిగా చూశారు. మీరు వెళ్లిపోతుంటే బాధపడటంలో ఆశ్చర్యమేముంది? అని నేరుగా ఎడ్వినాను ఉద్దేశించి నెహ్రూ మాట్లాడారని పమేలా తన పుస్తకంలో తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *