నక్షత్రం మూవీ స్టొరీ ఇదే

కృష్ణవంశి దర్శకత్వంలో వస్తున్న నక్షత్రం మూవీ పై నిన్నటి దాకా ట్రేడ్ లో పెద్ద అంచనాలు లేవు. కారణం అతని ట్రాక్ రికార్డు గత కొన్నేళ్ళుగా చాలా దారుణంగా ఉండటమే. రామ్ చరణ్ తో తీసిన గోవిందుడు అందరివాడేలే పల్టీ కొట్టాక తనకు ఫ్యామిలీ జానర్ సినిమాలు అచ్చి రావని అర్థం చేసుకున్న కృష్ణ వంశీ తిరిగి తన యాక్షన్ మోడ్ లోకి వచ్చాడు. నిన్న నక్షత్రం మూవీ ఆడియో రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. సందీప్ కిషన్ ఇందులో మెయిన్ హీరో కాగా స్పెషల్ రోల్ లో సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్నాడు.

విలన్ గా మొదటిసారి తనీష్ నటిస్తున్న ఈ  మూవీ లో రెజినా, ప్రగ్యా జైస్వాల్ హీరొయిన్స్. ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్ గా కట్ చేసిన వంశీ మరో సారి తన ట్రేడ్ మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్ ని ఇందులో చూపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది . మాస్ మసాలాలు కూడా ఏవి మిస్ కాకుండా అన్ని కరెక్ట్ గా దట్టించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రెజినా మరీ ఓపెన్ గా బోల్డ్ గా వంశీ చెప్పింది చెప్పినట్టు చూపించింది. ఇక కథ రఫ్ గా ఇలా ఉండబోతోంది.

సందీప్ చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. దాని కోసం చాలా కష్టపడి సెలక్షన్ వరకు వస్తాడు. కాని సందీప్ తో ఏదో విషయంలో గొడవ ఉన్న విలన్ తనీష్ అది రాకుండా అడ్డు పడతాడు. దీంతో సందీప్ పోలీస్ కాకపోయినా అదే స్పూర్తితో సొసైటీ లో జరిగే అన్యాయాలకు అడ్డు నిలవడానికి ప్రయత్నిస్తాడు. సందీప్ కు అప్పుడు డిపార్టుమెంటు లో ఉన్న డైనమిక్ ఆఫీసర్ సాయి ధరం తేజ్ గురించి తెలుస్తుంది. అతను మాయం కావడానికి కారణం తనీష్ అని తెలుసుకుంటాడు సందీప్.

మరి సంఘవిద్రోహానికి పాల్పడిన తనీష్ ని సందీప్ ఎలా అడ్డుకుంటాడు, దానికి సీనియర్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఎలా సహాయపడతాడు అనేది మిగిలిన స్టొరీ. సాయి ధరం తేజ్ చనిపోయి ఉంటాడా లేక బ్రతికే ఉంటాడా అనేది సస్పెన్స్. మొత్తానికి పోలీస్ బ్యాక్ డ్రాప్ లో చాలా ఇంటెన్సిటీ తో వంశీ ఈ మూవీ తీసినట్టు కనిపిస్తుంది.రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించని నక్షత్రం మూవీ పై ట్రైలర్ చూసాకే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *