తమిళంలో దున్నేశాడుగా..ఎంజీఆర్ నాకు పెదనాన్న: బాలయ్య

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ఘ‌న విజ‌యం సాధించిన‌ సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలోను సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. శ్రేయ, హేమమాలిని ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ అతిధి పాత్రలో సందడి చేసాడు. అయితే గౌత‌మి పుత్ర శాత‌కర్ణి చిత్రాన్ని ఆర్ఎన్సీ సంస్థ త‌మిళంలో భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

సోమవారం రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు. బాలయ్య తమిళ్ చూసి ఇటు మనవాళ్ళూ, అటు తమిళులూ కూడా ఆశ్చర్య పోయారు.

నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడి నీళ్లే తాగాను. ఇక్కడి గాలి పీలుస్తూ ఎదిగాను. గర్వంగా చెప్పగలను… నేను తమిళబిడ్డనని. మీ ఇంటి బిడ్డనని” అని హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు.

తమిళ లెజెండరీ యాక్టర్లైన ఎంజీఆర్.. శివాజీలను పెరియప్పా (పెదనాన్న).. చిత్తప్పా (చిన్నాన్న) అని సంబోధించడం ద్వారా అక్కడి జనాల మనసులు గెలిచాడు బాలయ్య. అంతే కాదు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను శివాజీ నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్’ సినిమాతో  పోల్చిన బాలయ్య.. అందులో శివాజీ పలికిన పవర్ ఫుల్.. లెంగ్తీ డైలాగ్ ను అలాగే అప్పజెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రాంతీయ భాషా చిత్రం కాదని, దేశం మొత్తం చూడవలసిన ఓ వీరుడి కథని, దీన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *