బాలయ్యను వాయించేస్తున్న నేషనల్ మీడియా

టాలీవుడ్ హీరోల్లో బాలయ్య బాబు తరహానే వేరు సినిమాల్లో ఎంత రౌద్రాన్ని ప్రదర్షిస్తారో బయట మాత్రం చాలా ఫ్రెంద్లీగా ఉందాడు అంటూ చెప్తూంటారు ఆయన తో పని చేసిన వాళ్ళంతా. కానీ బయట కనిపించే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుంది. సీసీఎల్ లో జనం మధ్యే సిగరెట్ తాగినా.., “కొట్టానంటే అయిపోయావే.. అంటూ ఫొటో దిగటానికి వచ్చిన అభిమానిని బెదిరించినా బాలయ్య స్టైలేవేరు.

బాలకృష్ణ పేరు నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగని ఆయన అభిమానులు మరీ సంబరపడిపోవాల్సిన పనేమీ లేదు. ఆయన ఓ రాంగ్ రీజన్ తో నేషనల్ మీడియాలో కనిపిస్తున్నారు. మొన్న తన కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తన అసిస్టెంటును బాలయ్య కొట్టడం.. అతడితో బూట్లు విప్పించుకోవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై స్థానిక మీడియాలో చాలానే రచ్చ జరిగింది. ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. నేషనల్ మీడియాలో సైతం దీనిపై వార్తలు నడుస్తున్నాయి. ఒక నేషనల్ ఛానెల్ బాలయ్య ప్రవర్తనపై చిన్న స్టోరీనే నడిపించేసింది.

ఇంతకుముందు బాలయ్య ఓ స్టేజ్ మీద అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్ చేయడాన్ని.. గతంలో అభిమానులతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఉటంకిస్తూ.. ప్రస్తుత ఘటనను మళ్లీ మళ్లీ చూపిస్తూ బాలయ్యను తప్పుబట్టే ప్రయత్నం చేసింది. సంఘటన జరిగిన రోజు పలు నేషనల్ వెబ్ సైట్లలోనూ దీనిపై వార్తలొచ్చాయి. తర్వాత టీవీ ఛానెళ్లలోనూ రచ్చ మొదలైంది. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని మీడియాల్లోనూ దీనిపై వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు కావడంతో తమిళ మీడియా ఈ సంఘటనకు వార్తల్లో బాగానే ప్రయారిటీ ఇచ్చింది.  మొత్తానికి చెంపదెబ్బ ఎపిసోడ్ తో బాలయ్యకు నెగెటివ్ పబ్లిసిటీ మాత్రం బాగానే వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల్ని తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో బాలయ్య వ్యవహారంపై ఇంత పెద్ద రచ్చ జరగడం చంద్రబాబు అండ్ కోకు ఇబ్బంది కలిగించే విషయమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *