ప్రియుడి పుట్టినరోజును పండగలా జరిపిన తార

అగ్ర కథానాయక నయనతార, దర్శకుడు విఘ్నేష్ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతు ఇప్పుడు నయనతార విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతున్నాయి. వీరిద్దరి జంట బావుందని కామెంట్ చేస్తునారు నెటిజన్లు. వీరిద్దరు ‘నేను రౌడినే’ అనే సినిమా షూటింగ్ సమయంలో ప్రమాలో పడ్డారని ప్రచారం. అప్పటి నుండి వీరిద్దరు కలిసి విహారయాత్రలకు , ఫంక్షన్లకు హాజరవుతున్నారు. ఇప్పటికే విఘ్నేష్ ‘నయన్ మై సన్ షైన్’ అంటూ పలుసార్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *