మహేశ్ ‘స్పైడర్’పై బాలీవుడ్ మీడియా దుష్ప్రచారం

జూన్‌లో వస్తుందని భావించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ ఎండింగ్‌కు షిఫ్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా దసరాకు వెళ్లడంపై బాలీవుడ్ మీడియా తనకు తోచిన విధంగా ఊహించుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా..?

జూన్ నుంచి ఏకంగా సెప్టెంబర్ ఎండింగ్‌కు షిఫ్ట్ అయిన స్పైడర్ సినిమాపై ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. స్వయంగా హీరో మహేశ్ బాబు ట్వీట్ చేసి ఈ సినిమాను దసరా సీజన్‌లో రాబోతున్నామని చెప్పడంతో… ఈ క్రేజీ హీరో అభిమానుల్లో ఉన్న సస్పెన్స్ కూడా తొలిగిపోయింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం తెలియాలంటే… మూవీ టీజర్ ఆడియెన్స్ ముందుకు వచ్చేంతవరకు వెయిట్ చేయాలంటున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్‌లో పర్ఫెక్షన్ కోసమే చిత్ర దర్శకుడు మురగదాస్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుంటే… ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి బాలీవుడ్ సినిమాలే కారణమని బీ టౌన్‌లోని మీడియా ప్రచారం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 11న స్పైడర్ మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేశారని.. అయితే ఆ సమయంలో కింగ్ ఖాన్ షారూఖ్ ‘రెహనుమా’, అక్షయ్ కుమార్ సినిమా ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ ఉండటం వల్లే ఈ సినిమా వెనక్కు వెళ్ళిందని ఓ వర్గం కామెంట్ చేస్తోంది.

తమిళంలో సరైన రిలీజ్ డేట్ దొరక్క ఈ సినిమా వెనక్కి తగ్గిందంటే ఓ అర్థం ఉందని.. ఏకంగా బాలీవుడ్ సినిమాల కారణంగా ‘స్పైడర్’ విడుదల వాయిదా వేశారని చెప్పడం ఏంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు బాహుబలి 2 తరువాత తెలుగు సినిమాలన్నీ బీ టౌన్ సినిమాలకు పోటీ ఇస్తాయనే ఉద్దేశంతో బాలీవుడ్ బాబులు ఇలా ఊహించుకుంటున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సో ‘స్పైడర్’ విషయంలోనూ బాలీవుడ్ మీడియా చాలా ఎక్కువగా ఊహించుకుంటోందని క్లియర్‌గా అర్థమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *