రివ్యూ : నెపోలియ‌న్

కథ :
సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ.

స‌మీక్ష‌

న‌టీన‌టులు త‌మ ప‌రిధిమేర బాగా న‌టించారు. ర‌వి వ‌ర్మ పాత్ర సినిమాలో కీల‌కం. ఆనంద్ ర‌వి ముఖ క‌వ‌ళిక‌ల్లో మొనాట‌నీ ఉంది. ఒకే ర‌క‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ఉంటాయి. ఎక్క‌డా స్ప‌ష్ట‌మైన‌ మార్పు క‌నిపించ‌దు. డైలాగులు చెప్ప‌డంలో మాత్రం క్లారిటీ ఉంది. క‌థ, క‌థ‌నం కొత్త‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది. ఎక్క‌డికక్క‌డ ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ‌ను క‌లిగించ‌గ‌లిగారు. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ల‌స్ అయింది. తెర‌మీద సినిమా క్వాలిటీగానే క‌నిపిస్తుంది. సిటీల్లో స‌గం మంది న‌డుం నొప్పికి కార‌ణం అనాథ‌రైజ్డ్ గా వేసిన స్పీడ్ బ్రేక‌ర్లేన‌ని చెప్ప‌డం బావుంది. నెపోలియ‌న్ ఎవ‌రు? అశోక్ ఎవ‌రు? తిరుప‌తి ఎవ‌రు? వ‌ంటి అయోమ‌యం సెకండాఫ్‌లో చాలా మందికి క‌లుగుతుంది. ఆ విష‌యంలో మ‌రికొంత క్లారిటీగా ఉంటే బావుండేది. అయినా త‌మిళ అనువాద చిత్రంగా విడుద‌లైన `భ‌ద్ర‌మ్‌` ఛాయ‌లు కొంత‌మేర ఈ చిత్రంలో క‌నిపించాయి. ఎవ‌రూ లేని అనాథ‌ల‌ను ఎంపిక చేసి వారి మీద ఇన్‌స్యూరెన్స్ చేసి చంప‌డం అందులో క‌థ‌. అనాథ‌ల‌ను టార్గెట్ చేస్తే అడిగేవారు ఉండ‌ర‌నే అంశంతోనే `నెపోలియ‌న్` క‌థ‌ను డిజైన్ చేసుకున్నారు. అయితే మ‌రింత ఎఫెక్టివ్‌గా, ఇంకాస్త రేసీగా చెప్పాల్సింది. సినిమాలో వేగం త‌గ్గింది.

న‌టీన‌టులు: ఆనంద్ ర‌వి, కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు
సంస్థ‌: ఆచార్య క్రియేష‌న్స్, ఆనంద్ ర‌వి కాన్సెప్ట్స్
.సంగీతం: సిద్ధార్థ్ స‌దాశివుని
కెమెరా: మార్గ‌ల్ డేవిడ్‌
ఎడిట‌ర్‌: కార్తిక శ్రీనివాస్‌
పాట‌లు: బాలాజీ
ఆర్ట్: బాబ్జీ
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ ర‌వి
నిర్మాత‌: భోగేంద్ర గుప్త మ‌డుప‌ల్లి
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *