నెస్ట్‌-2017 నోటిఫికేషన్‌

సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై మంచి సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు నెస్ట్‌ స్వాగతం పలుకుతోంది. 2017-22 విద్యా సంవత్సరంలో ఇంటెగ్రేటెడ్‌ పీజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నెస్ట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ భువనేశ్వర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయిల్లో ప్రవేశాలు లభిస్తాయి.

నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) – 2017 కు నోటిఫికేషన్‌ విడుదలైంది. బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంటెగ్రేటెడ్‌ ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం దీన్ని నిర్వహిస్తారు. 2017 విద్యా సంవత్సరంలో ఇంటెగ్రేటెడ్‌ ఎంఎస్సీ ప్రవేశం కోసం నిర్వహించే నెస్ట్‌ – 2017 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులో ప్రతిభ చూపించే విద్యార్థులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.

* కోర్సు: ఇంటెగ్రేటెడ్‌ ఎంఎస్సీ.
* విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌.
* అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బయాలజీ/ కెమిస్ట్రీ/ మేథమేటిక్స్‌/ ఫిజిక్స్‌లో ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
* కోర్సు వ్యవధి: అయిదు సంవత్సరాలు (2017 నుంచి 2022 వరకు).
* వయసు: 1 ఆగస్టు 1997 తర్వాత జన్మించిన వారు అర్హులు, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
* ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పరీక్షా విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో అయిదు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌ – 1 జనరల్‌ సెక్షన్‌ 30 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌ – 2 నుంచి 5 వరకు సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 50 మార్కులు. పరీక్షా సమయం 3 గంటలు.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
* చివరి తేది: 6 మార్చి
* వెబ్‌సైట్‌: www.nestexam.in

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *