నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్..దేశంలోనే తొలిసారి..

ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడేవారు ఇకపై ఒకటికి రెండుసార్లు చూసుకొని వాహనం నడుపాల్సిందే. దొరికితే చలాన్లు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏకం గా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్య లు తీసుకునేందుకు అధికారులు మంగళవా రం నుంచి పెనాల్టీ పాయింట్ల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశ పెట్టింది. లైసెన్స్ నంబర్ మీదుగా ఈ పాయిం ట్ల విధానం కొనసాగనున్నది. పది రోజులుగా ఈ విధానంపై ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు ట్రయ ల్ రన్ నిర్వహించారు.

new-penalty-point-system-in-hyderabad

నిబంధనలు పాటించని వారిపై ఒక పక్క ఈ-చలాన్‌లు జారీ చేస్తూనే మరో పక్క వాటికి సమాంతరం గా పాయింట్లు జత చేయనున్నారు. నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆర్టీఏ డేటా బేస్‌లో నమోదు చేస్తారు. వాహనదారుడికి రెండేండ్లలోపు 12 పాయింట్లు జత అయితే అతడి లైసెన్స్ వెంటనే రద్దవుతుంది. లర్నింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపేవారికి 5 పాయింట్లనే గడువుగా నిర్ధారించారు. 5 పాయింట్లు నిండగానే లర్నింగ్ లైసె న్స్ రద్దవుతుంది. దీంతో ఆ వ్యక్తి మళ్లీ కొత్త లర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసి ప్రాథమి క పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రద్దయిన సమయంలో వాహనం నడిపితే లైసెన్స్ లేనట్టే పరిగణిస్తూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తారు. దీంతో న్యాయస్థానం మూడు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *