అమెరికాకు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తాం: నార్త్‌కొరియా

తమపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కఠిన ఆంక్షలు విధించడాన్ని నార్త్‌ కొరియా తోసిపుచ్చింది. అమెరికా కనీవినీ ఎరుగని రీతిలో భారీ మూల్యం చెల్లించుకుంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లను ధిక్కరించి ఉత్తర కొరియా తాజాగా అణు పరీక్షలకు దిగడంతో ఐరాస భద్రతా మండలి ఆంక్షలు విధించింది.
కొరియా నుంచి టెక్స్‌టైల్‌ ఎగుమతులు, క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులను నిషేధించింది. తమపై ఆంక్షలు విధిస్తూ ఐరాస తీర్మానాన్ని తమ ప్రతినిధి బృందం తీవ్రంగా ఖండించిం‍దని, భధ్రతా మండలి చేసిన అక్రమ, చట్టవిరుద్ధ తీర్మానాన్ని తిరస్కరించిందని  ఉత్తర కొరియా ఐరాస రాయబారి హన్‌ టెసాంగ్‌ స్పష్టం చేశారు. అమెరికా తమకు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సైనిక వివాదాలకు దిగుతున్నదని విమర్శించారు.అమెరికాకు బుద్ధి చెప్పేలా తీవ్ర చర్యలకు కొరియా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.తామిచ్చే సందేశం అమెరికా చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని అనుభవాన్ని చవిచూస్తుందన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *