ఫస్ట్ లుక్ : ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ వర్మ మార్క్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. అడపా దడపా సినిమాలను తీస్తున్నప్పటికీ.. ట్వీట్స్ ద్వారానే ఎక్కువగా వివాదాస్పదమవుతున్నారు. ఈ మధ్య కాలంలో తను తీసే సినిమాలకు సంబంధించిన కథలు కూడా వివాదాలతో కూడుకున్నవే కావడం విశేషం. గతంలో వర్మ ఎన్టీఆర్‌పై సినిమా తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తీయడానికి చేసిన పరిశోధన పూర్తయిందని, ఈ మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత.. లక్ష్మీపార్వతి చెప్పిన నిజానిజాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ బయోపిక్‌కు బదులుగా.. ఆయనను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిన తెర వెనుక బాగోతాలను సినిమాగా తీయనున్నట్లు వర్మ ఇటీవల పోస్ట్ పెట్టారు.
ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు రాంగోపాల్ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. తాజాగా ఆయన మరో పోస్ట్ పెట్టారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో వర్మ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఓ కుర్చీలో కూర్చొనుండగా.. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా పోస్టర్ కనిపిస్తోంది. “అడుగు ఒక మనిషి మనసులో ప్రేమను పుట్టిస్తే.. అది అడుగు వందల మంది మనసులో ద్వేషాన్ని నింపింది.. కానీ ఆ ఒక్క అడుగే ఆయన్ను మళ్లీ మిలియన్ల మంది మనసుల్లో స్థానం పొందేందుకు ప్రేరణ నిచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ సారాంశం ఇదే” అని వర్మ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఆయన తెలిపారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *