ఎన్టీఆర్ – ది రియల్ బిగ్ బాస్

అనుమానాలు పటాపంచలయ్యాయి.  వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ క్రేజ్ వర్కవుట్ అయింది. తారక్ స్టామినా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ రియాలిటీ షోకు రానంత హయ్యస్ట్ టీఆర్పీని బిగ్ బాస్ షో దక్కించుకుంది. ఈ దెబ్బతో స్టార్ మా తిరిగి మొదటి స్థానానికి ఎగబాకింది.

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షో ఆదివారం ఎపిసోడ్ కు ఏకంగా 16.18 టీఆర్పీ వచ్చింది. ఇప్పటివరకు ఏ రియాలిటీ షోకు ఇంత టీఆర్పీ రాలేదు. అప్పుడెప్పుడో ఆట ఎపిసోడ్ కు 12 టీఆర్పీ వచ్చింది. ఈ గ్యాప్ లో చాలా షోలు నడిచినప్పటికీ దేనికీ బిగ్ బాస్ రేంజ్ క్రేజ్ రాలేదు.  యావరేజ్ గా చూసుకున్నప్పటికీ.. అన్ని రోజుల రేటింగ్ కలుపుకొని 10.4 యావరేజ్ టీఆర్పీతో నంబర్ వన్ గా నిలిచింది బిగ్ బాస్. ఈ ఒక్క షోతో స్టార్ మా ఆ వారానికి నంబర్ వన్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ గా నిలిచింది.

ఇక సెలబ్రిటీల పరంగా చూసుకున్నప్పటికీ ఎన్టీఆర్ నంబర్ వన్ లోనే ఉన్నాడు. గతంలో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి 12.34 టీఆర్పీ వచ్చింది. తాజాగా రానా చేస్తున్న ఓ షోకు 9.1 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య చిరంజీవి హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో 3.6 టీఆర్పీ సాధించింది. వీళ్లందరి కంటే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ కార్యక్రమం అత్యధిక టీఆర్పీ సాధించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *