రాజకీయాల్లోకి… ఎన్టీఆర్‌..!?

యస్‌… ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం ఆల్మోస్ట్‌ కన్ఫర్మ్‌ అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ జనాలు. ఈ పొలిటికల్‌ ఎంట్రీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్కెచ్‌ రెడీ చేస్తున్నారట. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్‌ వేసే అడుగులు జనాలకు మంచి థ్రిల్‌ ఇస్తాయట! వచ్చే ఎలక్షన్స్‌ టైమ్‌కి ఈ రాజకీయ చదరంగం, రణరంగం రెడీ అవుతుందని టాక్‌. పవర్‌ కోసం ఎన్టీఆర్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారా? మరో కారణం ఏమైనా ఉందా? అసలు, ఈ పొలిటికల్‌ కథేంటి? అనేది సినిమాలోనే చూడాలి.

ఎందుకంటే… ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నది రియల్‌ లైఫ్‌ పాలిటిక్స్‌లో కాదు, రీల్‌ లైఫ్‌ పాలిటిక్స్‌లో. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా పొలిటికల్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌ కథట! ఈ వార్తలు నిజమో? కాదో? చిత్రబృందమే చెప్పాలి. ప్రస్తుతం ‘జై లవకుశ’తో ఎన్టీఆర్, పవన్‌ కల్యాణ్‌ సినిమాతో త్రివిక్రమ్‌ బిజీగా ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *