ఒప్పో ఎఫ్‌ 3 ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

చైనా మొబైల్‌ దిగ్గజం  తన తాజాస్మార్ట్‌ఫోన్‌ ‘ఒప్పో’ లో కొత్త వేరియంట్‌ లాంచ్‌ చేసింది.   డబుల్‌ సెల్పీ కెమరాలతో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ను రోజ్ గోల్డ్ రంగు లో లాంచ్‌ చేసింది.  ఒ ఒప్పో ఈ కొత్త వేరియంట్‌ ఎఫ్‌ 3 ధరను రూ.19,900గా కంపెనీ నిర్ణయించింది.   ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌,  ఒప్పో ఆఫ్‌ లైన్‌ స్టోర్లలో ఇది అందుబాటులో ఉండనుంది.

.ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ తో 2.0 వెర్షన్ కు చెందిన ఒప్పో ఎఫ్ 3 ఇతర ఫీచర్స్‌ విషయానికి వస్తే ..ఫ్రంట్‌లో సెల్ఫీ కోసం ఒక కెమెరాను, గ్రూప్‌ సెల్ఫీకోసం మరో  కెమెరాను అమర్చింది.  అలాగే ట్రిపుల్‌ స్లాట్‌ ట్రే కార్డును( రెండు 4 జీ సిమ్స్‌, ఒక మొమరీ కార్డు) అందిస్తోంది.
భారతీయ వినియోగదారుడి ఫ్యాషన్, అధునాతన టెక్నాలజీ  అద్భుతమైన సంగమం అందించే లక్ష్యంతో, వినూత్న కెమెరా టెక్నాలజీ, ఒప్పో ఎఫ్‌3 లాంచ్‌ చేశామని ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ తెలిపారు. దీనికి  యూత్‌ నుంచి మంచిస్పందన లభించిందన్నారు.  అందుకే ఫ్యాషనబుల్‌, ట్రెండీయర్‌ వేరియంట్‌తో  ఇండియన్‌  యూత్‌కి మరింత సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నామని చెప్పారు.
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌ డీ డిస్‌ప్లే
1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌
16 ఎంపీ సెల్పీ కెమెరా
13ఎంపీ రియర్‌   కెమెరా,
4జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ( ఎస్‌డీ కార్డు ద్వారా  విస్తరించుకునే అవకాశం)
3200ఎంఏ హెచ్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *