రివ్యూ :మాస్‌కు ‘పైసావసూల్‌’

క‌థ
బాబ్ మార్లే(విక్ర‌మ్ జీత్‌) ఓ పెద్ద మాఫియా డాన్‌. పోర్చుగ‌ల్‌లో ఉంటాడు. బాబ్ త‌మ్ముడు స‌న్ని(అమిత్‌)ను ఇండియ‌న్ రా ఆఫీస‌ర్ చంపేస్తాడు. దాంతో ఇండియాపై ప‌గబ‌ట్టిన బాబ్ ఇండియాలో మార‌ణ హోమం క్రియేట్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. బాబ్‌కు ఇండియాలో ఓ మినిష్ట‌ర్‌(కృష్ణ‌కాంత్‌) స‌హా లోక‌ల్ మాఫియా అండ‌గా ఉంటుంది. హైద‌రాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జ‌రుగ‌ుతాయి. అమాయ‌కులైన జ‌నం చ‌నిపోతారు. పోలీస్ అధికారుల‌ను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో రా చీఫ్‌(క‌బీర్ బేడి), ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఈ మాఫియాకు వ్య‌తిరేకంగా వాడుకుని అంతమొందించాల‌నుకుంటాడు. అందులో భాగంగా తేడాసింగ్‌(నంద‌మూరి బాల‌కృష్ణ‌)తో పోలీస్ డిపార్ట్‌మెంట్ డీల్ కుదుర్చుకుంటుంది. తేడాసింగ్ త‌ను ఉండే కాల‌నీలో త‌న ప‌క్కింట్లో ఉండే హారిక‌(ముస్కాన్‌) వెంట‌ప‌డుతుంటాడు. హారిక తన అక్క‌య్య సారిక‌(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది. పోర్చుగ‌ల్ వెళ్లిన సారిక క‌న‌ప‌డకుండా పోతుంది. అయితే చివ‌ర‌కు హారికకు, త‌న‌ అక్క‌య్య సారిక‌కు, తేడాసింగ్‌కు మ‌ధ్య ఓ రిలేష‌న్ ఉంద‌ని తెలుస్తుంది. ఆ రిలేష‌న్ ఏంటి? అస‌లు తేడా సింగ్ ఎవ‌రు? సారిక‌, హారిక ఫ్యామిలీకి తేడాసింగ్ ఎందుకు ద‌గ్గ‌ర‌వుతాడు? అస‌లు సారిక ఏమవుతుంది? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణ‌
ఇప్ప‌టిదాకా నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన 100 సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఇందులో బాల‌య్య నూత‌నోత్సాహంతో క‌నిపించారు. భారీ డైలాగులు, భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాల‌య్య‌కు కొత్త కాదు. కానీ ఈ సినిమాలో ఆద్యంతం కొత్త‌గా చేశాడు. బీహార్‌లో తాగించిన‌వాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే, న‌న్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి, సింహానికి మేక ఎరేయాల‌నుకోవ‌డం క‌ర‌క్టే కానీ ఆ ప్లాన్ని మేక‌ల‌న్నీ క‌లిపి చేయ‌డ‌మే ఫన్నీగా ఉంది.. వంటి చాలా డైలాగులు ఈ సినిమాలో ఆడియ‌న్స్ ని మెప్పిస్తాయి. `జేబులో చెయ్యిపెట్టు.. ఏమైనా త‌గిలిందా..` వంటి మాస్ డైలాగులను కూడా బాల‌య్య అందంగానే ప‌లికారు. సినిమాలో ప్ర‌త్యేకంగా పెద్ద‌గా కామెడీ లేదు. అలీ పాత్ర‌ను చూడ‌గానే ఎవ‌రైనా కామెడీ ఉంటుంద‌ని ఊహిస్తారు. కానీ అలీ పాత్ర ఉండాలి కాబ‌ట్టి ఉన్న‌ట్టు అనిపిస్తుంది. రా ఏజెంట్‌గా బాల‌కృష్ణ‌ను దర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు, బాల‌కృష్ణ వ్యావ‌హారిక శైలి చాలా వ‌ర‌కు `పోకిరి` చిత్రాన్ని, పూరి గ‌త చిత్రాల‌ను గుర్తుచేస్తాయి. కెమెరాప‌రంగా, ఎడిటింగ్ ప‌రంగా సినిమా బాగా ఉంది. కానీ మావా ఏక్ పెగ్ లా, ప‌ద మ‌రి, పైసా వ‌సూల్ పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. హీరోయిన్లు వారి వారి ప‌రిధుల్లో బాగానే న‌టించారు. మినిస్ట‌ర్‌గా న‌టించిన కృష్ణ‌స్వామి శ్రీకాంత్ ముఖంలో భావోద్వేగాలు స‌రిగా ప‌ల‌క‌లేదు. క‌థలోనూ చెప్పుకోద‌గ్గంత కొత్త‌ద‌నం ఏమీ లేదు. క్లైమాక్స్ లో బాల‌కృష్ణ దేశం గురించి, దేశ‌భ‌క్తి గురించి మాట్లాడిన తీరు మెప్పిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మాస్‌ను, బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రించే పూరి జ‌గ‌న్నాథ్ మార్కు చిత్ర‌మిది.
ప్ల‌స్ పాయింట్స్
– బాల‌కృష్ణ న‌ట‌న‌
– సినిమాటోగ్ర‌ఫీ
– డైలాగ్స్‌
– ఎడిటింగ్
మైన‌స్ పాయింట్స్
– సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు.
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించలేదు
– ఇలాంటి క‌థ‌తో పూరి అల్రెడి సినిమా చేసేశాడు. కాబ‌ట్టి ఓ స్టేజ్‌లో సినిమా క‌థేంటో ప్రేక్ష‌కుడికి అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది.
రేటింగ్: 3.25/5
బ్యాన‌ర్: భ‌వ్య క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌, కైరా ద‌త్‌, క‌బీర్ బేడి, విక్ర‌మ్ జీత్‌, పృథ్వీరాజ్‌, అలీ త‌దిత‌రులు
మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌.జి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: వి.ఆనంద ప్ర‌సాద్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *