తూ క్యారే హౌలే…. అంటూ బాలయ్య: ఊగిపోతున్న ఫ్యాన్స్ (ట్రైలర్)

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్‌’. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం సాయంత్రం ఖమ్మంలో భారీ వేడుకలో ఆడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘పైసా వసూల్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్లో బాలయ్య చెప్పిన డైలాగులు కెవ్వు కేక అనే విధంగా ఉన్నాయి. క్యారే హౌలే అంటూ….. బాలయ్య చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలయ్య నీచ్, కమీనా, ఖతర్నాక్ తరహాలో రఫ్ అండ్ టఫ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ ఆపరేషన్ కోసం బాలయ్యను ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.సినిమాలో బాలయ్య పేరు తేడా సింగ్ అని తెలుస్తోంది. అయితే ఇది మారు పేరా? లేక సినిమాలో రియల్ క్యారెక్టర్ పేరు అనేదా? అనేది తేలాల్సి ఉంది. మేరా నామ్ తేడా… తేడా సింగ్… దిమాక్ తోడా… చాలా తేడా అంటూ బాలయ్య డైలాగ్స్ అదరగొట్టాడు.

బీహార్ నీళ్లు తాగినోళ్లనే తీహార్‌లో పోయించా తూ క్యారే హౌలే…… అంటూ బాలయ్య తన మాస్ క్యారెక్టర్ ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉంది అంటూ అభిమానుల నుండి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.ఒరేయ్…. నేను రామకృష్ణ థియేటర్ సందుల్లో పెరిగాను, మనది నేల టికెట్ బ్యాచ్, కసి తీరక పోతే శవాన్ని లేపి మళ్లీ చంపేస్తా అంటూ….. దర్శకుడు పూరి రాసిన డైలాగులకు సూపర్బ్ స్పందన వస్తోంది.

సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం కామన్. అయితే సినిమాలు స్పీడుగా పూర్తి చేస్తాడని పేరున్న పూరి జగన్నాథ్ తాను అనుకున్న దానికంటే ముందే పూర్తి చేశారు. దీంతో ముందు ప్రకటించిన విడుదల తేదీ కంటే ఓ నెల రోజుల ముందే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇదో రికార్డ్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *