టైటిల్ సాంగ్ తో బాలయ్య పైసా వసూల్.. వాటే ఎనర్జీ!!

నందమూరి హీరో బాలయ్య 101వ చిత్రం పైసా వసూల్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్ గా సాగుతుందని తెలుస్తుంది. శ్రేయా, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కైరా దత్ ఐటెం సాంగ్ తో సందడి చేయనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చిత్ర బృందం చెబుతుంది. ఇటీవల చిత్రానికి సంబంధించి స్టంపర్ వీడియో విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచిన టీం తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ‘నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..’ అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తుంది. మరి ఆ పాట మీరు చూసి ఎంజాయ్ చేయండి.

ఈ పాటలో ముఖ్యంగా చెప్పుకో తగ్గది అంటే అది కచ్చితంగా బాలయ్య ఎనర్జి గురించే. తన ఎనర్జి డాన్స్ తో అభిమానులుచే చిందులు వేయించే అంతగా చేశాడు బాలయ్య. ఆ వయస్సులో ఆ ఎనర్జీ ఎలా వచ్చిందో అంటూ చూసినోళ్ళకు షాకరే. ఈ సినిమాతో మరో మెరుపులాంటి అందం తెలుగు సినిమాకు పరిచయం కానుంది. కైరా దత్త్ అనే అమ్మాయి తన వంపులుతో ఈ పాటలో మెరిసింది. తన డాన్స్ మూవ్స్ తో అందరికీ ఉత్సాహం ఇవ్వనుంది. ఈ పాటకు పక్కా పైసా వసూల్ చేసే సత్తా ఉందినే చెప్పవచ్చు. మరో తెలుగు స్పెషల్ సాంగ్ హిట్ అయ్యి మాస్ బీట్ ను అభిమానించే వారికి మంచి పసందుగా ఉండబోతుంది ఈ పైసా వసూల్ ప్రోమో సాంగ్. అనూప్ రుబెన్స్ ఇచ్చిన్న ట్యూన్ కి అక్కడ బాలయ్య వేసిన స్టెప్లుకు అభిమానులు ఇప్పుడే దసరా జరుపుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *