పైసా వసూల్ లో ఉన్న ఆ ట్విస్ట్ అదేనా!

బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానుల్లో ఓ క్రేజ్ వచ్చేసింది. దానికి తోడు ఈ ప్రాజెక్ట్ కి పూరీ తనదైన శైలిలో పైసా వసూల్ అనే టైటిల్ పెట్టడంతో ఫ్యాన్స్ భారీ ఓపెనింగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ వార్త షికార్లు చేస్తుంది. పూరీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి కథను పోలీ పైసా వసూల్ ఉంటుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పైసా వసూల్ ట్రైలర్ చూస్తే ఆ విషయం అటు ఇటుగా అర్ధమైపోతుందని సినీజనాలు అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం పైసా వసూల్ లో బాలయ్య మేనరిజం, పోకిరిలో మహేశ్ మేనరిజంకు పోలిక పెట్టి ట్రాల్స్ వేస్తున్నారు. అయితే ఇదంతా నిజమే అని తలూపే వారు లేకపోలేదు. పోకిరీలో మహేశ్ అండర్ కవర్ కాప్ అనే విషయం విలన్స్ కి సెకండాఫ్ లో తెలుస్తుంది. కానీ పైసా వసూల్ ఓ బాలయ్య తానో అండర్ కవర్ కాప్ అని విలన్స్ కి చెబుతూనే వారిని ముప్పుతిప్పలు పెడతాడట.

ఇందులో ట్విస్ట్ ఏమందునుకుంటే పొరపాటే ఎందుకంటే బాలయ్యకి పోలిస్ డిపార్ట్ మెంట్ కి ఎలాంటి సంబంధం లేదనే విషయం చివర్లో తెలుస్తుందని అదే పైసా వసూల్ ని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మోతమెగిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతవరుకు నిజమో తెలుసుకోవలంటే మాత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న పైసా వసూల్ చూడాల్సిందే!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *