పన్నీర్ కు.. సూపర్ హీరో ఇమేజ్ వచ్చేసిందా?

ఉట్టిపడే విధేయత. ఆచితూచి మాట్లాడే మాటలు. మీడియాతో మాట్లాడేటప్పుడు చేతిలో ఉన్న పేపర్ ముక్కలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి వెళ్లిపోవటం.. మొత్తంగా చూస్తే వీలైనంత లో ప్రొఫైల్ ప్లే చేయటం.. తన ఇమేజ్ ఎక్కడా ఫోకస్ కాకుండా జాగ్రత్తగా ఉండటంతో పాటు.. తనను నమ్మకున్న వారికి అత్యంత నమ్మకస్తుడిగా కనిపించే పన్నీర్ సెల్వంలోని మరో కోణాన్ని తమిళ ప్రజలు చూస్తున్నారు.

పన్నీర్ అంటే అధినేత్రికి కట్టప్ప లాంటోడు అన్నట్లుగా ఫీలయ్యే వారికి షాకుల మీద షాకులిస్తున్నాడు. విధేయతతో ఉండాలే తప్పించి.. రాజ్యాన్ని పాలించే హక్కు లేదన్నట్లుగా చిన్నమ్మ లాంటి అహంకారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఇస్తున్న పంచ్ లు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. పన్నీర్ నుంచి ఇంత దూకుడును ఏ మాత్రం ఊహించని తమిళులకు ఇప్పుడాయన సరికొత్త హీరోగా మారారన్న మాట వినిపిస్తోంది.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ.. నగర జీవులకు ఆయనిప్పుడో సూపర్ హీరోగా మురిపోయారు. అమ్మకు మాత్రమే ఆయన విధేయుడని.. ఆమె పేరు చెప్పుకొని ‘అమ్మ’లు మారిపోయే వారికి విధేయుడు చూపిస్తున్న చుక్కలతో రోజురోజుకీ ఆయన ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోతోందట. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆయన పక్షాన నిలవటం గమనార్హం.

ఓపక్క మెజార్టీ ఎమ్మెల్యేలు చిన్నమ్మ పక్షాన ఉన్న వేళ.. సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ.. తమిళనాడులో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థతి. సున్నితవేళల్లోనూ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించటమే కాదు.. ప్రజలకు దిశా నిర్దేశం కల్పించేలా కొందరు సినీ తారలు వ్యవహరించటం కనిపిస్తుంది. తాజా ఎపిసోడ్ లో వారు చిన్నమ్మకు తమ మద్దతును ప్రకటించకుండా.. పన్నీర్ పట్ల సానుకూలత వ్యక్తం చేయటం గమనార్హం. చిన్నమ్మను సీఎం కాకుండా చేయటంలో పన్నీర్ ఎత్తుగడ పట్ల తమిళులు సంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. ఇప్పటివరకూ ఆయన మీదున్న ఇమేజ్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *