పవన్ బర్త్ డే గిఫ్ట్… ఫ్యాన్స్ ఖుష్

పవర్ స్టార్ పవన్ -త్రివిక్రమ్ కళ్యాణ్‌  కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఏ చిన్న  విషయం బయటికి రాకపోవడం…కనీసం  పోస్టర్ కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వారికి సర్‌ ప్రైజ్ ఇస్తు పవన్ బర్త్ డే గిఫ్ట్‌ని అందించాడు.

రేపు పవన్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందు సినిమా ఫస్ట్ లుక్‌ని  విడుదల చేశారు. ఇందులో పవన్‌ యంగ్‌లుక్‌లో కనిపించారు. అయితే సినిమా టైటిల్‌ను మాత్రం వెల్లడించలేదు. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు.

పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ మంచి  విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్స్ సోషల్‌ మీడియాలో ట్రెండవుతున్నాయి. ‘ఇంజినీరు బాబు’, ‘గోకుల కృష్ణుడు’, ‘దేవుడు దిగివచ్చిన వేళ’, ‘రాజు వచ్చినాడు’ అనే పేర్లు వినిపిస్తున్న  టైటిల్‌ ఏదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

1

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *