ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు శుభవార్త‌

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజ‌నీర్ బాబు, రాజు వ‌చ్చినాడో అనే టైటిల్స్ ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికి వారికి నిరాశే ఎదురైంది. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సెప్టెంబర్ 2న త‌ప్ప‌ని స‌రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టిల్ ఒక‌టి విడుద‌ల కానుంద‌నే హోప్స్ తో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ప‌వ‌న్ బ‌ర్త్ డేకి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపింది. దీంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప‌వ‌న్ బ‌ర్త్ డే త‌ర్వాత చిత్ర యూనిట్ కొద్ది రోజులు యూర‌ప్ కి వెళ్ల‌నుంది. సంక్రాంతిగా ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *