ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ స్టోరీ ఇదే

త్రివిక్రమ్ డైర‌క్ష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ 25చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప‌స్ట్ లుక్ విడుద‌లై అల‌రిస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిల్మింన‌గ‌ర్ లో ఓ వార్త చ‌క్కెర్లు కొడుతుంది. స్టోరీ ఇదే అయితే ప‌వ‌న్ విశ్వ‌రూపాన్ని చూడ‌వ‌చ్చని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప‌వ‌న్- మాట‌ల మాంత్రికుడి డైర‌క్ష‌న్ లో సినిమాలంటే మాంచి మ‌సాల, ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీలు ఇమిడి ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం పూర్తి విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఫ‌స్ట్ లుక్ తో కేక పుట్టించిన త్రివిక్ర‌మ్..సినిమా పేరును  ‘అజ్ఞాతవాసి’ కే ఓకే చెప్పినట్లు సమాచారం. మ‌హా భార‌త యుద్ధం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రానికి  ‘అజ్ఞాతవాసి పేరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతోందని ఫిలిం నగర్లో చెవులు కొరుకుంటున్నారు.

స్టోరీ ప్ర‌కారం మహాభారత యుద్ధంలో నకులుడికి శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. ఆదర్మం చేసిన వారిని రహస్యంగా చంపాల‌ని సూచిస్తాడు. దీనికి మ‌ద్ద‌తు ప‌లికిన న‌కులుడు అద‌ర్మం చేసిన వారిని హ‌త‌మారుస్తాడు. ఈ ఒక్క‌లైన్ ఆధారంగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. ఓ ప్ర‌ముఖ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా ప‌నిచేస్తున్న ప‌వ‌న్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఒకానొక స‌మ‌యంలో  జర్నలిస్ట్ గా ప‌నిచేసే  అను ఎమ్మాయూనెల్ పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతోంది.

మ‌రోవైపు న‌గ‌రంలో వ‌రుస‌హ‌త్య‌లతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతుంటారు. దీన్ని క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన జ‌ర్న‌లిస్ట్  అను ఎమ్మాయూనెల్ కొన్ని వాస్త‌వాల్ని వెలుగు చూస్తుంది. న‌గ‌రంలో జ‌రిగే హ‌త్య‌ల‌కు కార‌ణం ప‌వ‌న్ క‌ల్యాణేన‌ని ..ఎవ‌ర్ని ఎందుకు చంపుతున్నాడు..?. ఆ హ‌త్య‌ల‌కు ప‌వ‌న్ కు సంబంధం…? సాఫ్ట్ వేర్ గా ప‌నిచేస్తున్న హీరోకు మ‌ర్డ‌ర్లు చేయాల్సిన అవ‌స‌రం ఏంటీ…? మ‌హాభార‌త యుద్ధంలో న‌కులుడికి శ్రీకృష్ణుడు…ఈ సినిమాలో న‌కులుడి ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే శ్రీకృష్ణుడు ఎవ‌రు..? అనే విష‌యాల‌న్నీ తెర‌పైన చూడాల్సిందేనంట‌. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయ‌ట‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *