చిరుకి విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్: శరత్ మరార్

అభిమానులలో ఉన్న ఎన్నో అనుమానాలకి ఈ ట్వీట్ పులిస్టాప్ పెట్టినట్టుగానే అర్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి పవన్ కళ్యాణ్ రాకపోవచ్చు అని ప్రచారం జరగడంతో అటు చిరు, ఇటు పవన్ లు సన్నిహితంగా లేకపోవడం వలనే పవన్ హాజరు కావడం లేదంటూ పుకార్లు షికారు చేసాయి. కాని పవన్ నటిస్తోన్న తాజా చిత్రం కాటమరాయుడు చిత్ర నిర్మాత, పవన్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఓ ట్వీట్ చేసి అన్నింటికి పులిస్టాప్ పెట్టాడు. చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం పెద్ద సక్సెస్ కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడని శరత్ తన ట్వీట్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ తో ఫ్యాన్స్ ఓ డెసిషన్ కి వచ్చారు. ఇక పవన్ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరవుతాడా లేదా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ గానే ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *