ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమాలో స్టార్ హీరో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి కాంబోలో ఇప్ప‌టికే జ‌ల్సా – అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి తమ కాంబినేషన్‌లో మూడో సినిమాకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌కు రెండు హిట్లు అందించిన త్రివిక్ర‌మ్ ఈ మూడో సినిమా కోసం అదిరిపోయే క‌థ‌ను రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. మార్చి నెలలో సెట్స్‌పైకి వెళ్ళి ఓ పది రోజుల షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ కీ రోల్‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ఆ సూప‌ర్‌స్టార్ ఎవ‌రో కాదు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్. బొమన్ ఇరానీ, ఖుష్బు లాంటి స్టార్ యాక్ట‌ర్స్‌తో పాటు మోహ‌న్‌లాల్ కూడా ఈ సినిమాలో కీ రోల్‌లో న‌టించ‌నున్న‌ట్టు ఇండస్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే మ‌రింత క్రేజీ మూవీగా మారిపోయింది.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ హీరోయిన్‌గా నటించనుంది. ఇక మోహ‌న్‌లాల్, ఖుష్బూ యాడ్ అవ్వ‌డంతో ఈ సినిమాపై అటు త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో కూడా మార్కెట్ పెర‌గ‌నుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *