పెరగనున్న పెట్రోల్ ధరలు…

త్వరలోనే పెరగుననున్నా పెట్రోల్ ధరలు. సౌదీ అరేబియాలోని చమురు నిల్వలపై యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాత్ దారులు శనివారం డ్రోన్ దాడి చేశారు. దీనితో రోజుకు 57 లక్షల బ్యారేళ్ళ చమురు సరఫరా నిలిచిపోయింది. అంటే సగం చమురు ఉత్పత్తి ఆగిపోయినట్టే. దీని పర్యవసానం అంతర్జాతీయ మార్కెట్ లో చమురు సరఫరా రోజుకు 5 శాతం పడిపోయినట్టే. దీనితో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగుతాయి. వాటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి.

ఇప్పటికే అంతర్జాతీయంగా ధరలు 20 శాతం పెరిగాయి. దీని వల్ల మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ కు రూ.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చమురు సంస్థపై దాడి వెనక ఇరాన్ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్ ధరలు 12 డాలర్లు పెరిగి 67 డాలర్లకు చేరాయి. 1998 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ రేంజ్‌లో చమురు ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగితే… ఆ దేశంలో చమురు ఉత్పత్తి పడిపోతుంది. అందువల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చమురు కొరత ఏర్పడుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *