రంగస్థలంలో దువ్వాడ బ్యూటి చిందులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న.. రంగస్థల కళాకారుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సమంతతో పాటు అనసూయ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే ఆడి పాడనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ సరసన డీజే దువ్వాడ జగన్నాథ్ సినిమాలో గ్లామర్ షోతో ఆకట్టుకున్న పూజాను సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్ లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *