ఆ మొక్కు తీర్చమని అక్బరుద్దీన్‌పై ఒత్తిడి

గతంలో అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలుసు. ఒంట్లోకి తూటాలు దిగబడ్డాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. మృత్యువుతో పోరాడి గెలిచారు. ఇప్పటికీ అక్బర్‌ బాడీలో తూటా వుంది. అక్బర్‌ ఇలా ప్రాణాపాయస్థితిలో వున్నప్పుడు, లాల్‌ దర్వాజ అమ్మవారికి ఆయన భార్య మొక్కుకున్నారన్న ప్రచారం వుంది. అక్బరుద్దీన్‌ ఇద్దరు భార్యల్లో ఒకరు కన్‌వర్టెడ్ క్రిస్టియన్‌ అట. ఆమే హిందూ దేవుళ్లనూ నమ్ముతారట. తన భర్త మృత్యువుతో పోరాడుతున్నటైంలో, ప్రాణాపాయం నుంచి బయటపడితే, ఆలయ అభివృద్దికి పాటుపడతామని అనుకున్నారట. భక్తుల కోర్కెలు తీర్చే మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారట భార్య.  అక్బరుద్దీన్‌ ఇప్పుడు ఆరోగ్యంతో వున్నారు. అందుకే ఆ మొక్కు తీర్చుకోవాలని, భర్త అక్బరుద్దీన్‌పై ఒత్తిడి తెస్తున్నారట భార్య. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి, లాల్‌ దర్వాజ ఆలయాభివృద్దికి నిధులు విడుదల చేయాలని కోరారటక్బరుద్దీన్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *