చిరంజీవి పై తమిళ నటుడి సంచలన ఆరోపణలు

మూడేళ్ల కిందట వచ్చిన ‘గోవిందుడు’ అందరివాడేలే’ సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఆ సినిమాలో ప్రకారాజ్ చేసిన పాత్రకు ముందు తమిళ నటుడు రాజ్ కిరణ్ ను తీసుకోవడం.. అతడితో షూటింగ్ కూడా చేయడం గుర్తుండే ఉంటుంది. ఐతే సగం సినిమా అయ్యాక రషెస్ చూసుకుని రాజ్ కిరణ్ ఈ పాత్రకు సెట్టవ్వలేదని ఆయన్ని తప్పించి ప్రకాష్ రాజ్ ను తీసుకొచ్చారు. ఐతే ఈ సినిమా నుంచి తనను తప్పించిన విషయం తనకు చెప్పనే లేదంటూ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశాడు రాజ్ కిరణ్. తన పట్ల చాలా అన్యాయంగా వ్యవహరించారని అతను ఆరోపించాడు.

తాను ఈ సినిమాకు పని చేస్తుండగానే 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ఐతే రషెస్ చూసిన చిరంజీవి తన పాత్రకు ప్రాధాన్యం ఎక్కువైందని.. ఈ సినిమాలో హీరో రాజ్ కిరణా.. రామ్ చరణా అని అడిగినట్లు తనకు తెలిసిందని.. అందువల్లే తనను తప్పించి.. తన పాత్రను కొంచెం మార్చి ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారని అతను అన్నాడు. ప్రకాష్ రాజ్ అడిగితే.. తనకు మొత్తం సెటిల్ చేసినట్లు చెప్పారని.. కానీ ఆ సినిమాకు సంబంధించి తనకు రూ.10 లక్షలు రావాల్సి ఉందని ఆయన చెప్పాడు. అప్పట్లో వర్షాల వల్ల హైదరాబాద్ లో జరగాల్సిన షెడ్యూల్ ఆగిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యాక చెబుతామన్నారని.. కానీ దర్శకుడు కానీ.. హీరో కానీ.. నిర్మాత కానీ తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన వాపోయాడు. ఒక నటుడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని ఆయన ప్రశ్నించాడు. వాళ్ల ఇబ్బందులు ఏమున్నప్పటికీ తనకు ఈ విషయంలో సమాచారం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *