ఐదేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం.. బాహుబలికి లాస్ట్ వర్కింగ్ డే..

బాహుబలి.. టాలీవుడ్ స్థాయిని దిగంతాలకు తీసుకెళ్లిపోయిన ప్రాజెక్ట్ ఇది. తెలుగు నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించని రేంజ్ ను అందుకుంది. దేశంలో తొలిసారిగా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ ను అందుకునే చిత్రంగా బాహుబలి2 నిలవనుందని అంచనా వేస్తున్నారంటే.. ఈ మూవీ స్థాయి అర్ధమవుతుంది. అలాంటి చిత్ర రాజాన్ని తెరకెక్కించిన రాజమౌళి.. వణుకుతున్నాడట.

ఎందుకో తెలిస్తే మాత్రం తప్పులేదనే అనిపిస్తుంది. బాహుబలి కోసం ఇవాళ చివరగా పని చేస్తున్నారట టీం. ‘లాస్ట్ వర్కింగ్ డే.. అనుకుంటున్నా. ఎంత గొప్ప ప్రయాణం.. మరెంత గొప్ప అనుభూతి.. ఇప్పుడు నాకు ఒక వైపు చిరునవ్వు.. మరోవైపు కొంత బాధతో కూడిన వణుకు.. రెండూ అనుభవిస్తున్నా’ అని చెప్పాడు రాజమౌళి. ఐదేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత.. ఆ జర్నీ ఇవాల్టితో ముగిసిపోతుందని తెలిస్తే.. ఆ రోజున కచ్చితంగా ఇలాంటి అనుభూతి ఎవరికైనా కలుగుతుంది.

ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుంది. ఇవాళ రేపటి నుంచి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను హై లెవెల్ లో స్టార్ట్ చేసేయనున్నారు జక్కన్న అండ్ టీం. బాహుబలి2కి ముందు రెండు వారాలు.. వెనుక 4 వారాలు మరో సినిమా రిలీజ్ చేసేందుకు ఏ భాషలోనూ ఎవరూ ధైర్యం చేయడం లేదంటే.. ఈ చిత్రం స్థాయి ఏంటో అర్ధమవుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *