ట్రైలర్ టాక్: నాగ్ గదిలోకి వచ్చేసిండు

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ‘రాజు గారి గ‌ది 2’. పి.వి.పి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. లెజెండరీ యాక్టర్, దివంగత అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా నేడు(సెప్టెంబర్ 20) ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ…. ఇందులో మెంటలిస్టు పాత్ర చేస్తున్నాను. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిశాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ ఉంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది.

బీచ్ సైడ్ ఉండే ఒక ఇంటిని పట్టి వేధిస్తుంటుంది ఒక అమ్మాయి ఆత్మ. ఆ ఆత్మ ఎవరిదో కాదు.. డైరక్టుగా చూపించకపోయినా కూడా అది సమంతే నని అందరికీ తెలుసు. ఇకపోతే ఈ సినిమాలో సీరత్ కపూర్ మాత్రం భారీగా అందాలను ఆరబోసినట్లు ఉంది. ఒక షాట్లో ఆమెను బ్యాక్ నుండి బికినీలో చూపించేసి ఓంకార్ మార్కులు వేయించుకున్నాడు. ఇకపోతే సినిమాలో బికినీలో సీరత్.. దెయ్యంగా సమంత.. మెంటలిస్ట్ గా నాగార్జున.. భయపడే కమెడియన్లు వెన్నెల కిషోర్. షకలక శంకర్.. వీరు తప్పించి.. కథ మాత్రం ఇప్పటికైతే రొటీన్ గానే ఉంది. సినిమా రిలీజయ్యాక పార్టు 1లో ఇచ్చినట్లు ఓంకార్ ఏదన్నా టిస్ట్ ఇస్తాడేమో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *