బిజినెస్‌లో దూసుకుపోతున్న రకుల్…

సైలెంట్ గా వచ్చి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటిస్తూ బడా ఇమేజ్ అందుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ మూవీతో పాటు బెల్లంకొండ శ్రీను చిత్రం, నాగ చైతన్య మూవీస్ లలో కథానాయికగా నటిస్తుంది. ఈ అమ్మడి చేతిలో కొన్ని తమిళ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ వ్యాపారరంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టూడియో 45 అనే ఫిట్ నెస్ స్టూడియోని ప్రారంభించింది. ఇప్పుడు దీనికి బ్రాంచ్ లుగా పలు ఏరియాలలో స్టూడియోని ప్రారంభించే దిశగా రకుల్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా విశాఖపట్నంలోని డస్పల్లా హిల్స్ ప్రాంతంలో మార్చి 17న నిన్న మరో బ్రాంచ్‌ని లాంచ్ చేసింది.

ఫిట్‌నెస్‌ అంటే బరువులు ఎత్తడం కాదనీ, ఫిట్‌నెస్‌ అంటే కష్టపడటం కాదనీ.. ఫిట్‌నెస్‌ అంటే జస్ట్‌ సరదాగా వర్కవుట్స్‌ చెయ్యడమేనని చెప్పింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. హైద్రాబాద్‌తో పోల్చితే, అంతటి కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వున్న విశాఖలో ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన ఎక్కువేననీ, తమ స్టూడియోలో ఫిట్‌నెస్‌ థీమ్స్‌ కష్టంగా కాకుండా, ఇష్టంగా వుంటాయని రకుల్‌ సెలవిచ్చింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విశాఖలో స్థాపించిన కొత్త ఫిట్‌నెస్‌ స్టూడియోకి, టాలీవుడ్‌ హీరోలు రాణా, అక్కినేని అఖిల్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి చేతుల మీదుగానే ఈ స్టూడియో ప్రారంభమయ్యింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *