రామ్ కొత్త చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు.. ఎన‌ర్టిటిక్ హీరో రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ ఇప్పుడు త్రినాథ్‌ రావ్‌ నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘హలో గురు ప్రేమకోసమే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ..లోగోను విడుదల చేశారు.

అక్కినేని నాగార్జున నటించిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ ప్రేమకోసమేరో ఈ జీవితం..’ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇప్పుడు రామ్‌ నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నారు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. దిల్‌ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. సాయి కృష్ణ రచనా సహకారం అందిస్తారు. ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *