భరత్ యాక్సిడెంట్‌లో ఆ ముగ్గురు ఎవరు? వారు ఏమై పోయారు.. అనేక సందేహాలు..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలు కావటం తెలిసిందే. వాస్తవానికి శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరిగితే.. ఆదివారం ఉదయం పదిన్నర తర్వాత బయటకు రావటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఒక ప్రముఖుడు మరణిస్తే.. ఇంత ఆలస్యంగా గుర్తించటం ఏమిటన్నది సందేహంగా మారింది.

శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్ నుంచి భరత్ బయలుదేరినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి బయలుదేరిన అర్ధగంటలోపే భరత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ప్రమాద సమయంలో భరత్ వెంట కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. కారులో ఉన్నది ఎవరు? వారికి గాయాలయ్యాయా? అయితే వారెక్కడ ఉన్నారు? వారు బయటపడకపోవడం వెనుక బలమైన కారణమేమిటి? అనే అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

మరణానికి ముందు భరత్‌ది అదుపుతప్పిన జీవితం అనేది అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో స్టార్ హీరోగా మారిన రవితేజ్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించాడన్నది అందరికి తెలిసిందే. డ్రగ్స్ కేసులో పట్టుబట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంలో పోలీసులు, మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు.

చనిపోయింది ఎవరన్న విషయం మీద స్పష్టత లేదు. కారు నెంబరు ఆధారంగా యజమాని ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. భరత్ అమ్మ పేరు మీద కారు ఉంది. భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరిట కారు ఉండటంతో ఎవరన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. రాజస్థాన్ లో పుట్టిన వ్యక్తి మరణించినట్లుగా తేల్చారు. అయితే.. చనిపోయింది రవితేజ సోదరుడు అని మాత్రం గుర్తించలేదు. అయితే.. ఈ రోజు ఉదయం చనిపోయింది రవితేజ సోదరుడన్న సమాచారాన్ని మీడియా వర్గాలు పోలీసులకు.. ఆర్టీవో అధికారికి సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రమాదానికి ముందు భరత్, ఎవరిని కలిశాడు. ఎవరితో అర్ధరాత్రి వరకు ఉన్నాడు. ఏ స్థితిలో వస్తున్నారు? ఇలాంటి విషయాలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే భరత్ మిత్రులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారా? అనే వాదన వ్యక్తమవుతున్నది.నేర పరిశోధనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత బాగా ఉపయోగపడుతున్నది. పోలీసుల ప్రాథమిక విచారణలో నోవాటెల్ నుంచి భరత్ బయలుదేరేటప్పుడు కారులో మరో ముగ్గురు ఉన్నారన్న విషయం తేలింది. అయితే వారు మధ్యలోనే దిగిపోయారా? లేక వారు ఏమైపోయారు? ఆ ముగ్గురు ఎవరు అనే కీలకమైన ప్రశ్నగా మారింది.

కారు ప్రమాదం జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే కారులో మరెవరు ఉన్నా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ బతికిన తీవ్ర గాయాలయ్యే పరిస్థితి ఉంది. ఈ ఘటనలో ఆ ముగ్గురు ఎవరు. వారు మధ్యలో ఎక్కడ దిగిపోయారు అనేవి ముఖ్యమైన ప్రశ్నలుగా మారాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *