మాస్ హీరో అస్సలు మారలేదుగా ..!

రవితేజ ఏడాది గ్యాప్ తర్వాత సినిమాలకు అంగీకరించాడు. కిక్2 ఫ్లాప్.. బెంగాల్ టైగర్ హిట్ తర్వాత.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్.. ఒకేసారి రెండు ప్రాజెక్టులను ఓకే చేసేశాడు. రెండు సినిమాలు ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ గ్యాప్ రావడానికి కారణం రవితేజ రెమ్యూనరేషన్ పెంచేయడమే అనే టాక్ ఉంది.

ఏడాది పాటు ఖాళీగా అయినా ఉన్నాడు కానీ.. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గలేదట మాస్ హీరో. తను అడిగిన మొత్తం ఇచ్చాకే ఈ రెండు ప్రాజెక్టులకు సైన్ చేశాడట. మరోవైపు.. ఈ గ్యాప్ కూడా రవితేజ కావాలనే తీసుకున్నాడని అంటున్నారు సన్నిహితులు. బాగా సన్నబడ్డ లుక్ కి.. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో.. కొంచెం బరువు పెరగాలని డిసైడ్ అయ్యాడట. అందుకే బ్రేక్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే.. రీసెంట్ అనౌన్స్ అయిన కొత్త ప్రాజెక్టులకు ఇచ్చిన పోస్టర్లను చూస్తుంటే.. సన్నగా ఉన్న మాస్ మహరాజ్ కనిపిస్తున్నాడు కానీ.. కొంచెం కూడా ఒళ్లు చేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు.

ఏడాది పాటు గ్యాప్ తీసుకుని కూడా.. కొంచెం కూడా బరువు పెరగలేకపోవడం ఆశ్చర్యకరమే. ఇక రవితేజ కొత్త ప్రాజెక్టులను పరిశీలిస్తే.. టచ్ చేసి చూడు అనే మూవీని రేసుగుర్రం స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కించనుండగా.. రాజా ది గ్రేట్ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *