ఎన్టీఆర్ వ‌ల్లే.. ఆ ఇద్ద‌రూ వ‌చ్చారా?

బిగ్ బాస్ సెల‌బ్రెటీల గురించి పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. వీళ్లంతా సెల‌బ్రెటీలా?? వీళ్ల కంటే బెట‌ర్ ఎవ్వ‌రూ దొర‌క‌లేదా?? అంటూ ఎవ‌రి అభిప్రాయాన్ని వాళ్లు వ్య‌క్త ప‌రుస్తున్నారు. సెట‌బ్రెటీల‌ను ఎంచుకొనే వీలు ఎన్టీఆర్‌కి లేదు. అస‌లు సెల‌బ్రెటీలెవ‌ర‌న్న‌ది ఎన్టీఆర్‌కి తెలియ‌నే తెలీదు. అయితే.. ఓ ఇద్ద‌రు సెల‌బ్రెటీలు మాత్రం ఎన్టీఆర్ చొర‌వ‌తోనే ఈ షోలోకి అడుగుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. వారం రోజుల ముందే ఫైన‌ల్ లిస్ట్‌నిచూసిన ఎన్టీఆర్ ఈ జాబితాలో ధ‌న‌రాజ్‌, సంపూర్ణేష్‌బాబుల‌ను తీసుకోమ‌ని బిగ్ బాస్ బృందానికి సూచించాడ‌ట‌.

ఎన్టీఆర్ అడిగితే కానిదేముంది? అందుకే ధ‌న్‌రాజ్, సంపూల‌ను బిగ్ బాస్ టీమ్‌లోకి చేర్చుకొన్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ స‌ల‌హా బాగానే ప‌నిచేసింది. ఎందుకంటే… ధ‌న్‌రాజ్‌కి మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఇలాంటి వాళ్లు బిగ్ బాస్ లాంటి షోల‌కు చాలా అవ‌స‌రం. సంపూర్నేష్ బాబుకి సోష‌ల్ మీడియాలో మంచి అభిమ‌న‌గ‌ణం ఉంది. సంపూ ఉంటే.. షోకి కొత్త క‌ళ వ‌స్తుంది. సంపూ క‌చ్చితంగా ఈ షోకి ప్ల‌స్ పాయింటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఈ షోలో పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం. మంచు పాప‌.. ఎప్పుడు బిగ్ బాస్ సెట్లోకి అడుగుపెడుతుందో చూడాలి. పారితోషికాల ప్ర‌కారం.. మొత్తం ఈ 12 మందిలో ముమైత్‌ఖాన్‌కి అత్య‌ధిక పారితోషికం, క‌త్తి మ‌హేష్‌కి అత్య‌ల్ప పారితోషికం అందిన‌ట్టు స‌మాచారం. మిగిలిన‌వాళ్లంతా మ‌ధ్య‌స్థంగా పారితోషికం తీసుకొంటున్న‌వాళ్లే. ఎవ‌రి పారితోషికం ఎంత అనే విష‌యంలో బిగ్ బాస్ టీమ్ గోప్య‌త పాటిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *