రెడ్ మి 4ఏ సంచలనం

న్యూఢిల్లీ : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమి తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. భారత్ లో తొలి విడతగా గురువారం ప్రవేశపెట్టిన ఈ ఫోన్ అమ్మకాలు నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యాయి. అమెజాన్, ఎంఐ డాట్ కామ్ లో నాలుగు నిమిషాల్లో రెండున్నర లక్షలు ఫైగా ఫోన్లు అమ్ముడుపోయాయి. తమ వెబ్ సైట్ లో 10 లక్షలకుపైగా ‘నోటిఫై మీ’ అలర్ట్స్ వచ్చాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమైన వెంటనే తమ వెబ్ సైట్ కు నిమిషానికి 50 లక్షల హిట్స్, సెకను 1500పైగా ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది.

వినియోగదారుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన తమపై బాధ్యత మరింత పెంచిందని, ఈ విభాగంపై దృష్టి సారిస్తామని అమెజాన్ ఇండియా ప్రతినిధి నూర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం పట్ల షియోమి ఇండియా ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ధరలో ఇదే మోస్ట్ ఎఫోర్డ్ బుల్ స్మార్ట్ ఫోన్ అని తెలిపారు. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *