గూగుల్ తో కలిసి జియో ఏం చేస్తుందో తెలుసా?

రిలయన్స్ జియో మరో ఎత్తుగడకు పాల్పడుతోంది. సీక్రెట్ గా గూగుల్ తో కలిసి వినియోగదారుడికి అనువైన ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్లను రెడీ చేస్తోంది. అవి ఎక్స్ క్లూజివ్ గా ముఖేష్ అంబానీ 4జీ నెట్ వర్క్ కు మాత్రమే పనిచేయనున్నాయట. ఈ ఏడాది చివర్లో రిలయన్స్ జియో వీటిని లాంచ్ చేస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.  సరసమైన ధరల్లో స్మార్ట్ ఫోన్లను దేశంలో లాంచ్ చేయడానికి గూగుల్ కు ఇది రెండో అవకాశమట. 2014 సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టు ఫెయిల్యూర్ తర్వాత గూగుల్ మరోసారి రిలయన్స్ జియోతో కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 ఈ రెండు కలిసి రిలయన్స్ జియో స్మార్ట్ టీవీలకు సాఫ్ట్ వేర్ ను కూడా డెవలప్ చేస్తున్నాయని హిందూ బిజినెస్ లైన్ రిపోర్టు చేసింది. వీటిని ఈ ఏడాది తర్వాత లాంచ్ చేస్తుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. చౌకగా 4జీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడానికి రిలయన్స్ జియోకు గూగుల్ బ్రాండు ఎంతో సహకరిస్తుందని పేర్కొంటున్నాయి. మొదటిసారి ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకునే కొత్త యూజర్లను కంపెనీ ఎక్కువ మొత్తంలో పొందుతుందని చెప్పాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్లో జియో 100 మిలియన్ సబ్ స్క్రైబర్ల బేస్ ను చేధించింది. ఆండ్రాయిడ్ వన్ ను మరోసారి ప్రయోగించడానికి గూగుల్, జియోతో కలిసి పనిచేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *