రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత​ బైక్స్‌ లాంచ్‌

లగ్జరీ టూవీలర్‌ మేకర్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ రెండు కొత్త బైక్‌లను లాంచ్‌ చేసింది. థండర్‌ బర్డ్‌ 350ఎక్స్‌, థండర్‌ బర్డ్‌ 500ఎక్స్‌ పేరుతో వీటిని విడుదల చేసింది. థండర్‌ బర్డ్‌ 350ఎక్స్ ధర రూ. 1.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభధరగా ఉండగా 500 ఎక్స్‌ (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర రూ. 1.98 లక్షలుగా ఉంది. కొత్త కాస్మొటిక్‌ అప్‌గ్రేడ్స్‌ తో యువ బైకర్లే లక్ష్యంగా వీటిని భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. రెండింటిలోనూ డే టైం ఎల్‌ఈడీ లైట్లను, ఇంటిగ్రెటెడ్‌ హెడ్‌ ల్యాంప్‌, ఎల్‌ఈడీ టైయిల్‌ ల్యాంప్‌ను అమర్చింది. చిన్న హ్యాండిల్‌ బార్లను మార్చడంతోపాటు కొత్త 9 స్పోక్‌ అల్లాయ్ వీల్స్‌, ట్యూబ్‌లైస్‌ టైర్లు జోడించింది. అలాగే అదనంగా బ్లూ, ఆరెంజ్‌ సహా నాలుగులు రంగల్లో ఇవి లభ్యం కానున్నాయి.

350 ఎక్స్‌ ఫీచర్లు 
346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌
5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌
5,250ఆర్‌పీఎం వద్ద 19.8బీహెచ్‌పీ
4000 ఆర్‌పీఎం 28 ఎన్‌ఎం పీక్ టార్క్ అందిస్తుంది

500ఎక్స్‌ ఫీచర్లు 
499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజీన్‌
5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ 5.250 ఆర్‌పీఎం వద్ద 27.2 బీహెచ్‌పీ
4,000 ఆర్‌పీఎం వద్ద 41.3 ఎన్‌ఎం గరిష్ట​ టార్క్‌ అందిస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *