చిరు రికార్డ్ ని బద్దలు కొట్టిన ఎన్టీఆర్

మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ బద్దలు కొట్టాడు . ఇన్నాళ్లు వెండితెర స్టార్ లుగా వెలిగిన చిరంజీవి , నాగార్జున లు బుల్లితెర పై కూడా సక్సెస్ అయ్యారు అలాగే భారీ పారితోషికాలు అందుకున్నారు అయితే తాజాగా వాళ్ళ సరసన చేరాడు ఎన్టీఆర్ . బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దాంతో అతడికి రికార్డ్ స్థాయిలో 8 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి స్టార్ మా యాజమాన్యం ముందుకు వచ్చింది .

8 కోట్ల రెమ్యునరేషన్ అంటే రికార్డ్ మరి ఎందుకంటే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గాను చిరంజీవి అందుకున్న పారితోషికం 4 కోట్లు మాత్రమే ! దానికి రెండింతలు గా ఎన్టీఆర్ కు ఇస్తున్నారు స్టార్ మా యాజమాన్యం . తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తోంది కాబట్టి ఎన్టీఆర్ కూడా మరో మాట లేకుండా సంతకం చేయడం ఖాయం .

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *