సాహో బ్రేక్ చేసిన బాహుబలి రికార్డ్

‘సాహో’ సినిమా ‘బాహుబలి’ రికార్డును బ్రేక్‌ చేసింది. ఈ సినిమా తమిళనాడు వ్యాప్తంగా 550 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ను తమిళనాడులో మొత్తం 525 స్క్రీన్లలో ప్రదర్శించారు. దీంతో అక్కడ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టించిన బాక్సాఫీసు రికార్డును ‘సాహో’ బ్రేక్‌ చేసేలా ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. ‘బాహుబలి’ తర్వాత కోలీవుడ్‌లో తెలుగు సినిమాలకు మార్కెట్‌ పెరిగింది.  ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యాక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ సినిమాను తెలుగు, హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతున్నారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను డబ్‌ చేశారు. ఆగస్టు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *