భారత్ లో డాన్ జోయ్ ఆర్థోపెడిక్ ఉత్పత్తులు

సార్క్ దేశాల్లోనూ విక్రరుుంచనున్న సాన్‌డోర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థోపెడిక్ ఉత్పత్తుల తయారీలో ఉన్న అమెరికాకు చెందిన డీజేవో గ్లోబల్‌తో హైదరాబాద్ కంపెనీ సాన్‌డోర్ ఆర్థోపెడిక్స్ మార్కెటింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. డాన్‌జోయ్, ఎరుుర్‌క్యాస్ట్ బ్రాండ్ ఉత్పత్తులను భారత్‌తోపాటు సార్క్ దేశాల్లో సాన్‌డోర్ విక్రరుుంచనుంది. కీళ్ల నొప్పులు, ఎముకల పగుళ్ల  చికిత్సలో డీజేవో గ్లోబల్ ఉపకరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుందని సాన్‌డోర్ గ్రూప్ ఎండీ రాజీవ్ సింధి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. డీజేవో గ్లోబల్ తయారు చేసిన చాలా ఉత్పత్తులకు పేటెంటు ఉందని, ఇవి రూ.900 నుంచి లభిస్తాయని చెప్పారు.

 భారత్‌లో తయారీ..: డాన్‌జోయ్, ఎరుుర్‌క్యాస్ట్ ఉపకరణాల విక్రయం ద్వారా తొలి ఏడాది రూ.12 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నట్టు రాజీవ్ తెలిపారు. వార్షిక పరిమాణం రూ.30 కోట్లకు చేరుకున్నప్పుడు భారత్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను ఇరు సంస్థలు సమకూరుస్తాయని చెప్పారు. కొన్ని ఉత్పత్తులకు దిగుమతి సుంకం 28 శాతం దాకా ఉందని గుర్తుచేశారు. ఈ కారణంగా దేశీయంగా తయారు చేయడమే మేలని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *