ముఖ్యమంత్రి బాధ్యతలు శశికళ ఇష్టమే: డేట్ కూడా ఫిక్స్!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా ఎన్నికైన శశికళ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు మైత్రేయన్ చెప్పారు. ముఖ్యమంత్రి పగ్గాలు ఎప్పుడు చేపట్టాలనే నిర్ణయం శశికళదేనని మైత్రేయన్ అన్నారు. ఆయన వ్యాఖ్యల ద్వారా.. శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రోజులు దగ్గరపడుతున్నట్లుగా ఉంది. శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం బాధ్యతలు స్వీకరించవచ్చునని చెప్పారు. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో సందర్భంగా మైత్రేయన్ మాట్లాడారు. ఈ నెల 12 లేదా 18న శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం ఉందన్నారు.

ఏఐఏడీఎంకే సంప్రదాయం ప్రకారం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి జనరల్ సెక్రటరీగా ఉన్నవారు ముఖ్యమంత్రిగా పని చేస్తూ వచ్చారని, ఇదే తరహాలో శశికళ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి పీఠంపై ఎప్పుడు కూర్చుంటారన్నది శశికళ ఇష్టమని వ్యాఖ్యానించారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు బాధ్యతలు చేపట్టవచ్చునని, ఇందులో తాము చెప్పేందుకు ఏమీ లేదన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *