విడుదల కాకముందే కీలక సీన్ నెట్లో: హిట్ కాదుకదా యావరేజ్ కూడా కష్టమేనట

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘ట్యూబ్‌లైట్‌’.. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌ ‘సుల్తాన్‌’ తర్వాత.. ‘బజరంగీ భాయ్‌జాన్‌’ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ‘ట్యూబ్‌లైట్‌’ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి ఈద్ సీజన్లో తన సినిమా రిలీజ్ చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన ‘ట్యూబ్ లైట్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైంది. సల్మాన్ ఖాన్‌కు ఇంతకు ముందు ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ లాంటి సూపర్ హిట్లను అందించిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బేనర్లో స్వయంగా సల్మాన్ ఖానే నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ రోజు ఉదయం 9 గంటలకే సినిమా రిపోర్ట్ ఏమిటో బయట పెట్టాడు.

వన్ వర్డ్ లో రివ్యూ రాశారు. సినిమా పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉందని తేల్చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి సాలిడ్ స్టార్ పవర్, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నాయని… అయితే ట్యూబ్ లైట్ బాడీ ఎంతో అందంగా ఉన్నా సోల్(ఆత్మ) మిస్సయింది అంటూ చెప్పారు. దాంతో ఎంతో పెద్ద సినిమా అవుతుందనుకున్న ట్యూబ్ లైట్ క్రేజ్ సగానికి సగం పడిపోయింది. అంతే కాదు ఈ సినిమాకి గుండేకాయలాంటి సీన్ కూడా విడుదలకంటే ముందే నెట్ లో ప్రత్యక్షమైపోయింది…

వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న సల్మాన్‌ఖాన్‌, ‘ట్యూబ్‌లైట్‌’తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అనుకుంటున్న సమయంలో, ‘ట్యూబ్‌లైట్‌’ సినిమా మీద వస్తున్న రిపోర్ట్ అందర్నీ విస్మయానికి గురిచేసింది. మొత్తానికి సల్మాన్‌ నుంచి భారీ హిట్‌ ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్ర యూనిట్‌ కు షాక్‌ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సీను ఆన్‌లైన్‌లో లీకవ్వడమే కాదు.. అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *